గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించని యూసీ బ్రౌజర్ యాప్... తప్పుదోవ పట్టిస్తోందని డిలీట్ చేసిన ఆండ్రాయిడ్!
- 30 రోజుల పాటు నిషేధం విధించిన ఆండ్రాయిడ్
- ఇన్స్టాల్స్ సంఖ్యను పెంచడం కోసం తప్పుదారులు ఎంచుకుంటోందని ఆరోపణ
- స్పష్టం చేసిన యూసీ బ్రౌజర్ ఉద్యోగి
ఇన్స్టాల్స్ సంఖ్యను పెంచడం కోసం తప్పుదారులు ఎంచుకుని, ఇష్టం వచ్చినట్లు అడ్వర్టైజ్మెంట్లను యూసీ బ్రౌజర్ ఇస్తుందని, ఇది ఆండ్రాయిడ్ పాలసీలకు విరుద్ధం కావడంతో తాత్కాలికంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూసీ బ్రౌజర్ యాప్‌ను ఆండ్రాయిడ్ తొలగించిందని మేగజైన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై యూసీ బ్రౌజర్ ఉద్యోగి ఒకరు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. యూసీ బ్రౌజర్‌ను ప్లేస్టోర్ నుంచి 30 రోజుల పాటు తొలగిస్తున్నట్లు తనకు ఈ మెయిల్ వచ్చినట్లు ఆ ఉద్యోగి స్పష్టం చేశాడు.