సినిమాకి ముందు హీరో, దర్శకులను మిత్రుల్లా చూస్తాను.. మొదలయ్యాక శత్రువులే!: బండ్ల గణేశ్
- 'తీన్ మార్' కోసం త్రివిక్రమ్ చాలా కష్టపడ్డారు
- ఆ సినిమా ఎందుకు ఆడలేదన్నది ఇప్పటికీ అర్థం కాలేదు
- నాకు 'గబ్బర్ సింగ్' కన్నా ఆ మూవీనే ఎక్కువగా నచ్చుతుంది
- సినిమా నిర్మాణం విషయంలో నేను సీరియస్ గానే వుంటాను
"తీన్ మార్' సినిమా గుండెను పిండేస్తుంది .. మరి ఎందుకు ఆడలేదో. దానిని కరెక్ట్ గా ఎడిటింగ్ చేసి మళ్లీ ఇప్పుడు రిలీజ్ చేసినా సూపర్ హిట్ అవుతుంది .. డౌటే లేదు" అని చెప్పారు. "ఇక ఏ సినిమా అయినా మొదలుపెట్టే వరకూ హీరోను .. దర్శకుడిని నా ఫ్రెండ్స్ లా చూస్తాను. సినిమా మొదలయ్యాక ఎనిమీస్ (శత్రువులు) లా చూస్తాను. వీళ్లు .. ఏం చేస్తున్నారు? అది సినిమాకి ఏమైనా దెబ్బ అవుతుందేమో? అన్నట్టుగా వుంటాను. నన్ను బతికించేది సినిమా కాబట్టి ఆ విషయంలో అలా వుంటాను" అని చెప్పుకొచ్చారు.