'సైరా' రెగ్యులర్ షూటింగ్ తేదీ ఖరారు .. భారీ యాక్షన్ సీన్స్ తో షూటింగ్ మొదలు
- 'సైరా' రెగ్యులర్ షూటింగ్ కి సన్నాహాలు
- డిసెంబర్ 6వ తేదీ నుంచి షూటింగ్ మొదలు
- ఫస్టు షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్
- నయనతారతో పాటు ప్రియాంక చోప్రా
డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా షూటింగును ప్రారంభించనున్నారు. మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ యాక్షన్ సీన్స్ ను కంపోజ్ చేసే పనిలో ఫైట్ మాస్టర్లు నిమగ్నమైనట్టు సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ .. ప్రియాంక చోప్రా .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.