'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా షూటింగ్ కు అంగీకరించని నిమ్మకూరువాసులు.. వెనుదిరిగిన యూనిట్!
- 'లక్ష్మీ‘స్ వీరగ్రంథం' సినిమా షూటింగ్ కు మరోసారి ఇబ్బందులు
- ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో సన్నివేశాల చిత్రీకరణకు ప్రయత్నం
- అభ్యంతరం చెప్పి అనుమతి ఇవ్వని గ్రామ పంచాయతీ
- నిరాశతో వెనుదిరిగిన చిత్రయూనిట్
ఎన్టీఆర్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించేందుకు పంచాయతీ పెద్దలను ఈ సినిమా దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆశ్రయించారు. సన్నివేశాల చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో సమావేశమైన పంచాయతీ పాలకవర్గం, గ్రామపెద్దలు చిత్రీకరణకు అభ్యంతరం చెప్పారు. ఈ సినిమా కారణంగా ఎన్టీఆర్ తో పాటు నిమ్మకూరుకు కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే అనుమతి ఇవ్వలేమని వారు స్పష్టం చేశారు. దీంతో గ్రామస్థులకు ఇష్టం లేకుండా సన్నివేశాలు చిత్రీకరించమని చెబూతూ చిత్రయూనిట్ ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, వెనుదిరిగారు.