షాపింగ్ మాల్ లో బన్నీ షూటింగ్ సందడి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షాపింగ్ మాల్ లో బన్నీ షూటింగ్ సందడి!

  • తాజా షెడ్యూల్ లో 'నా పేరు సూర్య'  
  • ప్రధాన తారాగణంపై షాపింగ్ మాల్ లో షూటింగ్ 
  • విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ 
  • ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు     
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా తెరకెక్కుతోంది. ' నా ఇల్లు ఇండియా' అనేది ట్యాగ్ లైన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా చెబుతున్నారు.

 దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది మొదటి చిత్రం. అయినా ఎంతో అనుభవం వున్న వాడిలా చిత్రీకరణ చేస్తున్నాడట. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల నిర్మాతలు సంతృప్తిగా వున్నారని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారు.       
Allu Arjun
anu emmanuel

More Telugu News