ఎవరెస్టుపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన రష్యన్ సాహసికుడు!
- వింగ్ సూట్ తో ఎత్తైన పర్వతాల నుంచి బేస్ జంప్ చేసే రష్యన్ వలెరి రొజోవ్
- 2013లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు
- 2016లో బేస్ జంప్ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు
- తాజాగా 6,812 మీటర్ల ఎత్తైన అమ డాబ్లం పర్వతంపై నుంచి దూకి మృత్యు ఒడికి చేరిన సాహసికుడు
ఇలాంటి సాహసాలు చేసే వలెరి రొజోవ్ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 2013లో 7220 మీటర్ల ఎత్తున్న పర్వతం పైనుంచి బేస్ జంప్ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అనంతరం 2016లో మరోసారి 7700 మీటర్ల ఎత్తైన పర్వతం నుంచి బేస్ జంప్ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు. అయితే గత రికార్డు ఎత్తుకంటే తక్కువ ఎత్తున్న అమ డాబ్లం పర్వతంపైనుంచి కిందికి దూకుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతని మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆయన మృతదేహం కోసం గాలిస్తున్నారు.