చంద్రన్న బీమా ఉన్న వారికి 10 లక్షలు, లేని వారికి 8 లక్షలు ఎక్స్ గ్రేషియా: చినరాజప్ప
- మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం
- ప్రమాద కారకులను ఎవరినీ వదిలిపెట్టం
- సహాయక చర్యలు ముమ్మరం
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అన్ని విధాలుగానూ ఆదుకుంటామని, తక్షణం ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని ఆయన తెలిపారు.