ఈ నెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం: సినీ నటుడు శివాజీ
- ప్రత్యేక హోదా ఎవడబ్బ సొత్తు కాదు
- ప్యాకేజీ అన్నవాళ్లంతా భూస్థాపితమవుతారు
- హోదా కోసం జగన్, పవన్ లు నడుం బిగించాలి
ప్రత్యేక హోదాను సాధించడానికి వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నడుం బిగించాలని అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో ఒరిగేది ఏమీ లేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదానే కీలక అంశంగా మారబోతోందని... ప్రత్యేక ప్యాకేజీ అన్నవాళ్లు భూస్థాపితమవుతారని జోస్యం చెప్పారు. ఇప్పుడు ఉన్న ఎంపీల్లో 72 శాతం మంది వ్యాపారస్తులే ఉన్నారని... పేదల కష్టాలు వీరికెలా తెలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.