అదుపుతప్పిన చైనా స్పేస్ స్టేషన్... ఆ మూడు మహానగరాలకు ముప్పు!
- అంతరిక్షంలో అదుపుతప్పిన చైనా స్పేస్ స్టేషన్
- అమెరికాలోని న్యూయార్క్, చైనాలోని బీజింగ్, జపాన్ లోని టోక్యో నగరాలపై కూలే అవకాశం
- అక్కడ కాకుంటే లాస్ ఏంజెలిస్, ఇస్తాంబుల్, రోమ్ లపై కూలే ప్రమాదం
అంతే కాకుండా ఈ స్పేస్ స్టేషన్ అమెరికాలోని న్యూయార్క్, చైనాలోని బీజింగ్, జపాన్ లోని టోక్యో నగరాల్లో కూలే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఈ మూడు మహానగరాలే కాకుండా లాస్ ఏంజెలిస్, ఇస్తాంబుల్, రోమ్ లకు కూడా ప్రమాదం పొంచివుందని, ఆ నగరాలు కాకపోతే ఈ నగరాలపై కూలే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇది కచ్చితంగా ఎక్కడ కూలుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేము కానీ... సదరు స్పేస్ స్టేషన్ భూ వాతావరణంలో ప్రవేశించడానికి రెండు గంటల ముందు మాత్రం చెప్పగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దానిపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది.