నా ఆరోగ్యం బాగానే ఉంది..వదంతులు నమ్మొద్దు: సినీ నటుడు కోట శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఆరోగ్యం బాగానే ఉంది..వదంతులు నమ్మొద్దు: సినీ నటుడు కోట శ్రీనివాసరావు

  • కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
  • అలాంటి ఛానెల్స్ పై ప్రభుత్వం చర్యలు చేపట్టాలి
  • ఎంపిక చేసుకున్న చిత్రాల్లోనే నటిస్తున్నా: కోట శ్రీనివాసరావు
 తాను అనారోగ్యం పాలైనట్టు కొన్ని యూ ట్యూబ్ ఛానెల్స్ లో వస్తున్న వార్తలను టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఖండించారు. తన ఆరోగ్యం విషయమై కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ గురించి ఆయన మాట్లాడుతూ, చిత్రసీమలో పరిస్థితులు మారాయని, ఎంపిక చేసుకున్న చిత్రాల్లో మాత్రమే నటిస్తున్నానని కోట శ్రీనివాసరావు చెప్పారు.
Kota
youtube

More Telugu News