అసెంబ్లీ బహిష్కరణపై.. జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

  • అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై ఫిర్యాదు
  • పులివెందుల ప్రజలను మోసం చేశారంటూ కంప్లైంట్
  • ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద కేసు నమోదు చేయాలంటూ విన్నపం
వైసీపీ అధినేత జగన్ పై పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. టీడీపీ నేత రామగోపాల్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా... పులివెందుల ప్రజలను జగన్ మోసం చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన జగన్, ప్రజాసమస్యలపై అసెంబ్లీలో చర్చించకుండా, అసెంబ్లీని బహిష్కరించారని అన్నారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 కింద జగన్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
Go Back to Shorts
ys jagan
YSRCP
complaint against jagan
pulivendula

More Telugu News