పద్ధతి మార్చుకోండి.. లేకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: చైనాకు భారత్ వార్నింగ్
- అరుణాచల్ ప్రదేశ్ మాదే
- అక్కడ పర్యటించే అధికారం మాకు ఉంటుంది
- వన్ బెల్ట్ వన్ రోడ్ విషయంలో కూడా మాకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి
తమ దేశంలో ఒక రాష్ట్రమైన అరుణాచల్ లో పర్యటించే స్వేచ్ఛ, హక్కు తమ ప్రజలకు ఉంటుందని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వ్యవహారాల్లో చైనా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తినా... పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దక్షిణ టిబెట్ లో అరుణాచల్ ప్రదేశ్ భాగమన్న చైనా వ్యాఖ్యలు హాస్యాస్పదమని తెలిపింది. అలాగే చైనా నిర్మిస్తున్న 'వన్ బెల్ట్ వన్ రోడ్' విషయంలో కూడా భారత్ కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది.