జగన్‌పైకి సీబీఐ కుక్కలను వదిలింది సోనియానే.. భూమన సంచలన వ్యాఖ్యలు
- జగన్ ఎదుగుదలను సోనియాగాంధీ ఓర్వలేకపోయారు
- ఏ తప్పూ చేయకున్నా కక్షగట్టి జైలుకు పంపారు
- అశోక్ నీతిమంతుడైతే ప్రమాణం చేయాలి: బొత్స
తానెంతో నీతిమంతుడినని చెప్పుకుంటున్న కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆ విషయాన్ని పైడితల్లి అమ్మవారిపై ప్రమాణం చేసి గంటస్తంభం వద్ద చెప్పాలని మరోనేత బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. భోగాపురం విమానాశ్రయ పనుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. విమానాశ్రయ నిర్మాణ పనుల్లో చంద్రబాబు, అశోక్ గజపతిరాజు కుమ్మక్కయ్యారని అన్నారు. ప్రైవేటు కంపెనీలకు కాంట్రాక్టులు దోచిపెట్టి కమీషన్ల కోసం వెంపర్లాడుతున్నారని బొత్స ఆరోపించారు.