త‌న‌ పిల్లల ఫొటోల‌ను పోస్ట్ చేసిన సింగర్ సునీత‌.. వారికి సోద‌రిలా ఉన్నావంటున్న అభిమానులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త‌న‌ పిల్లల ఫొటోల‌ను పోస్ట్ చేసిన సింగర్ సునీత‌.. వారికి సోద‌రిలా ఉన్నావంటున్న అభిమానులు!

  • మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకున్న సునీత
  • చిరున‌వ్వులు చిందిస్తూ త‌న పిల్ల‌ల‌తో ఫొటో
  • మోడ్ర‌న్ డ్రెస్సులో క‌న‌ప‌డుతోన్న సునీత‌
ఎన్నో సినిమా పాట‌లు పాడి మంచి గాయ‌నిగా గుర్తింపు తెచ్చుకున్న సునీత తాజాగా త‌న కూతురు, కుమారుడి ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. విత్ మై ల‌వ్ అంటూ త‌న కుమారుడు ఆకాశ్‌, కూతురు శ్రేయాల మధ్య చిరున‌వ్వులు చిందిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఈ ఫొటోలో త‌న పిల్ల‌ల‌కు దీటుగా మోడ్ర‌న్ డ్రెస్‌లో సునీత క‌న‌ప‌డుతున్నారు. 'వారు మీ పిల్ల‌లా? న‌మ్మ‌లేక‌పోతున్నాం.. వారికి మీరు సోద‌రిలా ఉన్నారు.. వావ్‌...' అంటూ అభిమానులు ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. సాధార‌ణంగా ఆమె అన్ని వేదిక‌ల‌పై చీర క‌ట్టుతోనే క‌నిపిస్తార‌న్న విష‌యం తెలిసిందే. అల‌రిస్తోన్న ఈ ఫొటోను మీరూ చూడండి... 
singer
sunitha
children

More Telugu News