Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీ అంటేనే హార్డ్ వర్క్ .. ఆయన మాములుగా కష్టపడటం లేదు

  • షూటింగ్ దశలో ' నా పేరు సూర్య'
  • ఊటీలో ముగిసిన షెడ్యూల్ 
  • హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ 
  • కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్  
బన్నీ తాను చేసే సీన్ అయినా .. ఫైట్ అయినా .. డాన్స్ అయినా పెర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. ఇందుకోసం ఆయన ఎంత కష్టమైనా పడతాడు .. పదే పదే రిహార్సల్స్ చేస్తాడు. ఈ విషయాన్ని ఆయనతో పనిచేసిన దర్శకులంతా చెబుతుంటారు. ప్రస్తుతం తాను చేస్తోన్న 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాకి కూడా ఆయన అదే విధంగా కష్టపడుతున్నాడు.

ఒక వైపున కుటుంబం పట్ల బాధ్యత .. మరో పక్కన దేశం పట్ల భక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మరింత ఫిట్ నెస్ తో కనిపించడం కోసం బన్నీ ఎంతో కసరత్తు చేశాడు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతూ వచ్చింది. ఒక్కరోజు గ్యాప్ తో తరువాత షెడ్యూల్ షూటింగును హైదరాబాద్ లో చేస్తున్నారు. 40 రోజులుగా నాన్ స్టాప్ గా కొనసాగుతోన్న ఈ సినిమా షూటింగులో బన్నీ విరామం లేకుండా పాల్గొంటున్నాడు. ఏ మాత్రం ఎనర్జీ లెవల్స్ తగ్గకుండా ఆయన పడుతోన్న కష్టం చూసి, యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారట. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను , ఏప్రిల్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  
Allu Arjun
anu emmanuel

More Telugu News