వారెవ్వా.. అదృష్టం అంటే ఆమెదే... ఒకే రోజు రెండు లాటరీలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వారెవ్వా.. అదృష్టం అంటే ఆమెదే... ఒకే రోజు రెండు లాటరీలు!

  • 6.4 లక్షల రూపాయలు లాటరీ గెలుచుకున్న కింబర్లీ మోరిస్
  • ఆ డబ్బులో 1300 రూపాయలతో మరో టికెట్ కొనుగోలు చేసిన కింబర్లీ
  • దానికి 6.47 కోట్ల రూపాయల నగదు బహుమతి లభ్యం
అమెరికాకు చెందిన ఒక మహిళను చూసిన వారంతా అదృష్టం అంటే ఆమెదేనని పేర్కొంటున్నారు. ఎందుకంటే, ఒకే రోజు ఆమె రెండు లాటరీలు గెలుచుకుంది మరి! ఆ వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని ఉత్తర కరోలినాకు చెందిన కింబర్లీ మోరిస్ అనే మహిళ ఇటీవల డైమండ్‌ డ్యాజ్లర్‌ లాటరీ టికెట్‌ కొనుగోలు చేసింది. ఈ లాటరీ ఆమెను వరించింది. ఇందులో ఆమె 6.4 లక్షల రూపాయల నగదు గెల్చుకుంది.

వెంటనే లాటరీ మొత్తాన్ని తీసుకుని, అందులోంచి 1300 రూపాయలు ఖర్చు చేసి, మరో లాటరీ టికెల్ కొనుగోలు చేసింది. ఈ సారి ఆమెను మరింత అదృష్టం వరించింది. దీనికి 6.47 కోట్ల రూపాయల నగదు బహుమతి తగలింది. దీంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ లాటరీలో పన్నులన్నీ పోను ఆమె ఖాతాలో 2.5 కోట్ల రూపాయలు చేరాయి. తాను పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటానని కల కనేదాన్నని, అందుకే రెండో లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, అది తగలడంతో తన కల నెరవేరిందని ఆమె తెలిపింది.
america
lottery
carolina
double dhamaka

More Telugu News