భావోద్వేగంతో మైదానంలో కంటతడి పెట్టిన క్రికెటర్ మహ్మద్ సిరాజ్
- తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సిరాజ్
- క్యాప్ అందించిన రవిశాస్త్రి
- చేదు అనుభవాన్ని మిగిల్చిన తొలి మ్యాచ్
మరోవైపు, తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ సిరాజ్ కు చేదు అనుభవాన్నే మిగిల్చింది. భయపడుతూనే బౌలింగ్ ను స్టార్ట్ చేశాడు. తొలి ఓవర్ తొలి బంతికే ఫోర్ ఇచ్చాడు. మొత్తం నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే మూడో ఓవర్ రెండో బంతికి కివీస్ కెప్టెన్ విలియంసన్ ను పెవిలియన్ కు చేర్చడం సిరీజ్ కు కాస్త ఊరట. ఈ మ్యాచ్ లో భారత్ 40 పరుగుల తేడాతో ఓడిపోవడం కూడా సిరాజ్ కు మింగుడుపడని అంశమే. కెరీర్ ఆరంభంలో ఆటగాళ్లకు ఇలాంటి చేదు అనుభవాలు మామూలే. దీన్ని, అధిగమించి రానున్న రోజుల్లో సిరాజ్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో వేచి చూడాలి.