సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • పారిస్ చేరుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా
  • దిల్ రాజు చేతికి 'జైసింహ' ఉత్తరాంధ్ర హక్కులు 
  • అంతా దైవాదీనం అంటున్న రకుల్ 
  • భారీ రేటుకి పవన్ సినిమా ఆడియో హక్కులు
*  'క్వీన్' చిత్రం షూటింగ్ కోసం కథానాయిక తమన్నా పారిస్ చేరుకుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల 'క్వీన్' రీమేక్ షూటింగ్ ఏకకాలంలో పారిస్ లో జరుగుతోంది. అయితే, తమన్నా మాత్రం కాస్త ఆలస్యంగా ఈ షూటింగులో జాయిన్ అయింది. తెలుగు, మలయాళ వెర్షన్లకు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు.
*  బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జైసింహ' ఉత్తరాంధ్ర ప్రదర్శన హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రధాన నాయికగా నయనతార నటిస్తోంది.
*  ఇటీవల వచ్చిన 'స్పైడర్' చిత్రం ఫెయిల్యూర్ గురించి ఆ చిత్ర కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ను తాజాగా అడిగితే, తెలివిగా సమాధానం చెప్పింది. "మన ప్రయత్నాలు కొన్ని ఫలిస్తాయి, కొన్ని ఫలించవు. అయితే, నేను మాత్రం దేనికైనా వంద శాతం ఎఫర్ట్ పెడతాను. తర్వాత దైవాదీనం" అంటూ సమాధానాన్ని సూటిగా చెప్పకుండా తప్పించుకుంది.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అజ్ఞాతవాసి' చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ సంస్థ భారీ రేటుకి దక్కించుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా ఆడియో విడుదలవుతుంది.  
Go Back to Shorts
Thamanna
Rakul
Balakrishna
Pawan Kalyan

More Telugu News