నెల్లూరులో పోలీసుల ముందో సవాల్... సినిమా హాల్ లో వాష్ రూమ్ కు వెళ్లి తిరిగి రాని భార్య!
- 31న నెల్లూరులోని ఎస్-2 థియేటర్ లో ఘటన
- బంధుమిత్రులను విచారించినా దొరకని ఆచూకీ
- పోలీసులను ఆశ్రయించిన భర్త
వీరు 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 థియేటర్ లో సినిమాకు వచ్చారు. సినిమా మధ్యలో హరిత వాష్ రూముకు వెళ్లి వస్తానని వెళ్లింది. ఆపై తిరిగి రాలేదు. ఆ చుట్టుపక్కలా గాలించి, బంధుమిత్రులను విచారించిన అవినాష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని, హరిత ఏమైందన్న విషయాన్ని కనుగొంటామని తెలిపారు.