gujarat: గుజరాత్ లో పట్టుబడ్డ ఐఎస్ఎస్ ఉగ్రవాదుల ఫైరింగ్ ప్రాక్టీస్.. వీడియోలు లభ్యం!

  • గుజరాత్ లోని సూరత్ లో పట్టుబడిన ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు
  • ఎన్నికల నేపథ్యంలో ఆలయాలపై దాడులు చేసేందుకు ప్రణాళిక
  • తుపాకులతో కాల్పులు ప్రాక్టీస్ చేసిన ఖాసిం, ఉబేద్
గుజరాత్ లోని సూరత్ లో ఏటీఎస్ పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల కుట్రకోణాన్ని పోలీసులు వెల్లడించారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో అల్లకల్లోలం సృష్టించేందుకు సూరత్ లో పట్టుబడిన ఖాసిం, ఉబేద్ లు ప్రయత్నిస్తున్నారని వారు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ భావజాలానికి ఆకర్షితులై వారు అందులో చేరినట్టు తెలిపారు. కేవలం తాము చేరడం మాత్రమే కాకుండా, ఇతరులను కూడా చేర్చేందుకు ప్రయత్నించారని వారు వెల్లడించారు.

ఈ క్రమంలో వారు ఆలయాలపై దాడులు నిర్వహించేందుకు ప్రాక్టీస్ కూడా చేశారని వారు తెలిపారు. ఈ మేరకు పలు ఆలయాలపై రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలిపారు. వారు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఖాసిం సూరత్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తుండగా, ఉబేద్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
gujarat
surat
isis terrorists
attacks plan
firing practice

More Telugu News