విక్రమ్ కుమార్ ను అఖిల్ ఇబ్బంది పెట్టేశాడంటూ టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విక్రమ్ కుమార్ ను అఖిల్ ఇబ్బంది పెట్టేశాడంటూ టాక్!

  • విక్రమ్ కుమార్ తో అఖిల్ 'హలో'
  • హైదరాబాద్ లో జరుగుతోన్న చివరి షెడ్యూల్ 
  • డిసెంబర్ 22వ తేదీన విడుదల   
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ 'హలో' సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయాలని నాగార్జున భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

అఖిల్ అన్ని విషయాల్లోను జోక్యం చేసుకుంటూ విక్రమ్ కుమార్ ను ఇబ్బంది పెట్టేశాడనేది ఆ వార్త సారాంశం. కథా కథనాల విషయంలోను .. పాత్రలను మలిచే విధానంలోను విక్రమ్ కుమార్ ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాంటిది .. పాటలు ఇలా ఉండాలి .. ఫైట్లు అలా ఉండాలి అంటూ విక్రమ్ కుమార్ కి అఖిల్ సలహాలు ఇచ్చాడట. ఆయన ధోరణి విక్రమ్ కుమార్ కి ఇబ్బందిని కలిగించడంతో నాగ్ దృష్టికి తీసుకెళ్లాడట. ఇందులో వాస్తవమెంతుందోగానీ .. ఇప్పుడిదే ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.         
akhil
kalyani

More Telugu News