సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • అమెరికాలో బర్త్ డే జరుపుకుంటున్న మెహ్రీన్ 
  • శివబాలాజీ, నవదీప్ ల మల్టీ స్టారర్ 
  • రీమేక్ నుంచి డ్రాప్ అయిన రవితేజ
  • బాబీకి విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్
*  గత పది నెలల పాటు విరామం లేకుండా తెలుగు సినిమాలలో నటించిన అందాలభామ మెహ్రీన్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని హాలిడే కోసం అమెరికా వెళ్లింది. ఈ వారంలో తన బర్త్ డే వేడుకను అక్కడే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరుపుకుంటుందట.
*  ఇటీవల 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా మరింత పాప్యులారిటీ తెచ్చుకున్న యువ నటులు శివబాలాజీ, నవదీప్ కలసి ఓ చిత్రంలో నటించనున్నారు. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
*  తమిళంలో హిట్టయిన 'బోగన్' చిత్రం తెలుగు రీమేక్ లో రవితేజ నటించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చిన సంగతి విదితమే. అయితే, తాజా సమాచారం ప్రకారం రవితేజ ఈ ప్రాజక్టు నుంచి బయటకు వచ్చేశాడట. దీనికి కారణం ఏమిటన్నది తెలియాల్సివుంది.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో మంచి పాప్యులారిటీ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. ఇటీవల ఎన్టీఆర్ తో 'జై లవ కుశ' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు బాబీ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.  
Mehrin
raviteja
vijay

More Telugu News