ఫీచర్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేయడం లేదు... స్పష్టం చేసిన జియో
- ఉత్పత్తి నిలిపివేత గురించి వస్తున్న వార్తలు అవాస్తవమన్న కంపెనీ
- త్వరలోనే రెండో విడత ప్రీ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడి
- `కై` ఓఎస్‌తో పనిచేసే జియో ఫీచర్ ఫోన్
ప్రస్తుతం `కై` ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తున్న జియో ఫీచర్ ఫోన్లలో చాలా వరకు యాప్స్ పనిచేయడం లేదు. అలాగే ఎయిర్టెల్ కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫీచర్ ఫోన్లను విడుదల చేయనుండటంతో పోటీని తట్టుకోలేననే భయంతో జియో ఫీచర్ ఫోన్ల ఉత్పత్తిని నిలిపివేసిందని `ఫ్యాక్టర్ డెయిలీ` ప్రచురించింది.