ముంబై ఇండియన్స్‌కు షాక్.. గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన పాండ్యా!
- వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో పాల్గొననున్న పాండ్యా?
- సొంతం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న బెంగళూరు
- రూ.10 కోట్లు అయినా చెల్లించేందుకు సిద్ధమవుతున్న ఫ్రాంచైజీలు
టీమిండియాలో ఆల్‌రౌండర్‌గా ఎదుగుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న హార్ధిక్ పాండ్యా వేలానికి వస్తే పది కోట్ల రూపాయలైనా ఇచ్చి తీసుకునేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. పాండ్యాపై కన్నేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ నుంచి పాండ్యా బయటకు వస్తే అది ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, వచ్చే ఏడాది వేలంలో ధోనీ, రైనా, బెన్‌స్టోక్స్, స్టీవ్ స్మిత్ వంటి వారు పాల్గొననుండగా ఈ జాబితాలో పాండ్యా పేరు కూడా కనిపించనుంది.