`రోబో 2.0` తెలుగు ఆడియో వేడుక వ్యాఖ్యాత‌గా రానా ద‌గ్గుబాటి!

  • త‌మిళ ఆడియో వేడుక వ్యాఖ్యాత‌గా ఆర్జే బాలాజీ
  • దుబాయ్‌లో జ‌ర‌గనున్న వేడుక‌
  • ఏఆర్ రెహ‌మాన్ లైవ్ ప్ర‌ద‌ర్శ‌న కూడా
శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్స‌న్‌, అక్ష‌య్ కుమార్‌లు న‌టించిన `రోబో 2.0` చిత్ర ఆడియో వేడుక రేపు దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్ఠాత్మ‌క కార్య‌క్ర‌మంలో తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమానికి రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హరించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే త‌మిళ భాష ఆడియో కార్యక్రమానికి `స్పైడ‌ర్‌` సినిమాలో న‌టించిన ఆర్జే బాలాజీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర ఆడియో వేడుక‌కు సంబంధించి దుబాయ్‌లో ప్రెస్‌మీట్ కూడా నిర్వ‌హించారు. ఈ ఆడియో వేడుక సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ లైవ్ ప్ర‌ద‌ర్శ‌న కూడా ఉంటుంద‌ని చిత్ర‌యూనిట్ పేర్కొంది.
Go Back to Shorts
robo 2.0
new poster
director
shankar
rajnikanth
amy jackson
akshay kumar

More Telugu News