టిప్పు సుల్తాన్ కు ప్రశంసలు... బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టిన రాష్ట్రపతి ప్రసంగం!
- టిప్పు సుల్తాన్ ను వీరుడిగా కీర్తించిన రాష్ట్రపతి
- కోవింద్ వ్యాఖ్యలతో బీజేపీకి షాక్
- టిప్పును ద్రోహిగా అభివర్ణిస్తున్న బీజేపీ
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను బీజేపీ నేతలు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మైసూర్ పాలకుడిగా వేలాది మంది హిందువులు, క్రిస్టియన్ లను టిప్పు సుల్తాన్ హతమార్చాడని... మత మార్పిడులకు పాల్పడ్డాడని బీజేపీ ఎమ్మెల్యే అశ్వంత్ నారాయణ్ పేర్కొనడం దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు బీజేపీతో విభేదిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.