దిగ్గజ గాయకురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత గిరిజాదేవి కన్నుమూత
- కార్డియాక్ అరెస్ట్‌తో ఆసుపత్రిలో చేరిక
- పరిస్థితి విషమించడంతో మృతి
- ప్రగాఢ సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
గిరిజాదేవి మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. ఆమె పాటలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. బనారస్ సమీపంలోని ఓ చిన్న పల్లెటూరులో జమీందారు కుటుంబంలో పుట్టిన గిరిజాదేవి సంగీతాన్ని తన జీవితంగా మార్చుకున్నారు. లెజెండరీ సింగర్‌గా ఎదిగారు. 1972లో పద్మశ్రీ, 1989లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.