కేసీఆర్ కు, నాకు సంబంధాలు అంటగట్టడం దారుణం: పయ్యావుల కేశవ్
- రేవంత్ కు వ్యక్తిగత అజెండానే ముఖ్యం
- ఆయన సర్టిఫికెట్ నాకు, యనమలకు అవసరం లేదు
- తెలంగాణలో నాకు వ్యాపారాలు లేవు
గత ఆరు నెలలుగా రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని... దానికి సంబంధించిన సమాచారం తన వద్ద ఉందని చెప్పారు. చంద్రబాబును రేవంత్ కలిసిన తర్వాతే తాను స్పందిస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ చేరే విషయంపై తాను ఇప్పుడు ఏమీ మాట్లాడనని అన్నారు. పార్టీ కంటే వ్యక్తిగత అజెండానే రేవంత్ కు ముఖ్యమని మండిపడ్డారు. తనకు, మంత్రి యనమలకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. నాకు, పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు.