ఒక రోజు ముందుగానే విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'!
- పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి'
- త్వరలో యూరప్ షెడ్యూల్ మొదలు
- ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి
- సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు
షూటింగ్ తో సమానంగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. డిసెంబర్ 2వ వారం నుంచి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారట. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ ఒక రోజు ముందుగానే ఈ సినిమాను థియేటర్స్ కు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఈ మధ్య మిడ్ నైట్ షోలకి .. ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు లభించడం కష్టమవుతోన్న నేపథ్యంలో, ఈ సినిమాను జనవరి 9వ తేదీన సెకండ్ షోతో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.