కర్ణాటకలో ఫైట్స్ చేసేస్తోన్న పవన్ కల్యాణ్!
- పవన్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి'
- పవన్ కెరియర్లో 25వ సినిమా
- కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్
- జనవరి10వ తేదీన ప్రేక్షకుల ముందుకు
ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండా షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇది పవన్ కి 25వ సినిమా .. త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా. అందువలన త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను విదేశాలలో ప్లాన్ చేశారు. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.