టైప్2 మధుమేహాన్ని అదుపులో ఉంచే పిల్స్... రూపొందించిన యూకే శాస్త్రవేత్తలు
- బరువును కూడా తగ్గించే మాత్రలు
- ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 బాధితులే ఎక్కువ
- సరైన చికిత్సను ఎంచుకోకపోతే ప్రమాదమే
వ్యాధిగ్రస్థులు సామర్థ్యానికి మించి మందులు తీసుకోవడం వల్ల హైపోగ్లైసీమియా (శరీరంలో చక్కెర శాతం తక్కువగా ఉండే స్థితి) వచ్చి, చికిత్సను సంక్లిష్టంగా మారుస్తుందని లీసెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన మెలానియే డేవీస్ పేర్కొన్నారు. ఆమె తన సహోద్యోగులతో కలిసి చేసిన ప్రయోగంలో 632 మంది టైప్2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ప్లేసిబో, సెమాగ్లుటైడ్ మందులను వేరు వేరుగా వివిధ మోతాదుల్లో 26 వారాలపాటు ఇచ్చారు.
ప్లేసిబో తీసుకున్న వారికంటే సెమాగ్లుటైట్ మందు తీసుకున్న వారిలో 5 శాతానికిపైగా బరువు తగ్గడాన్ని గమనించారు. దాదాపు 71 శాతం బాధితులకు సెమాగ్లుటైడ్ ఉపశమనం కలిగించినట్టు పరిశోధనా వ్యాసంలో తెలియజేశారు.