శ్రీరాముడే మాడు పగలగొడతాడు: బీజేపీపై లాలూ నిప్పులు

  • రాముడి పేరిట రాజకీయాలు మొదలు
  • బీజేపీది నీతిమాలిన చర్య
  • నిప్పులు చెరిగిన ఆర్జేడీ అధినేత
తన పేరును చెప్పుకుని రాజకీయం చేస్తున్న బీజేపీని ఆ శ్రీరామచంద్రుడే శిక్షిస్తాడని రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. దీపావళి సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, రాముడి పేరు చెప్పి బీజేపీ రాజకీయాలు చేస్తుండటం నీతిమాలిన చర్యగా అభివర్ణించారు. ఎన్నికలు మరో రెండేళ్లలోపే జరగనుండటంతో అయోధ్యను మరోమారు తెరపైకి తెచ్చారని, యూపీసీఎం ఆదిత్యనాథ్ సైతం మోదీ రాజకీయ నాటకంలో భాగమయ్యారని ఆరోపించారు.

మతం పేరిట జరుగుతున్న ఈ డ్రామాను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని అన్నారు. నిజంగా రామమందిరం నిర్మాణానికి కట్టుబడిన వారైతే, ఈ మూడేళ్లూ ఏం చేశారని లాలూ ప్రశ్నించారు. మోదీ సర్కారు నోట్ల రద్దుతో పేద ప్రజల జీవనాన్ని మరింత దుర్భలం చేసిందని ఆరోపించిన ఆయన, దేశ ప్రజల మనసులో గూడుకట్టుకున్న శ్రీరామచంద్రుడే ఆర్ఎస్ఎస్, బీజేపీలను నామరూపాల్లేకుండా చేస్తాడని, ఈ రెండు పార్టీలనూ దేశం నుంచి తరిమేస్తాడని జోస్యం చెప్పారు.
Go Back to Shorts
lalu
ayodhya
ramalayam
up
modi

More Telugu News