పిల్లల్ని ఓవెన్లో పెట్టి చంపి.. వీడియోను భర్తకు పంపిన భార్య!
- రెండేళ్ల లోపున్న ఇద్దరు కొడుకులను దారుణంగా చంపిన తల్లి
- భర్తతో వీడియో చాట్ చేస్తూ ఘటన
- ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోందన్న ఇరుగుపొరుగు వారు
తనతో వీడియో చాట్ చేస్తుండగా ఏదో ఘోరం జరగబోతోందని గ్రహించానని చిన్నారుల తండ్రి జమీల్ పెన్ పేర్కొన్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం అందించినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి చేరుకునే సరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. చిన్నారులు ఇద్దరూ మృతి చెందారు. కాగా, ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు తెలిపారు. విలియమ్స్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.