దీపావళి విషెస్ తెలిపిన డొనాల్డ్ ట్రంప్ కూతురు

దీపావ‌ళి పండగ సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. మంగ‌ళ‌వారం నాడు శ్వేత‌సౌధంలోని ఓవ‌ల్ ఆఫీస్‌లో జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్న ఆమె ఆ వేడుక ఫొటోనే పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేసింది. `ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు, సిక్కులు, జైనులంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. మీ అంద‌రికీ సాల్ ముబార‌క్‌. భార‌త్ రావ‌డానికి ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాను` అని ఆమె ట్వీట్ చేసింది. వ‌చ్చే నెల హైద‌రాబాద్‌లో జ‌రగ‌నున్న గ్లోబ‌ల్ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ స‌ద‌స్సుకు ఆమె హాజ‌రుకానున్న సంగ‌తి తెలిసిందే. వైట్‌హౌస్‌లో జ‌రిగిన దీపావ‌ళి వేడుక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌తో పాటు భార‌తీయ అమెరిక‌న్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Go Back to Shorts
diwali
white house
donald trump
ivanka
tweet
wishes

More Telugu News