తాజా ప్లాన్లలో భారీ మార్పులు చేసిన జియో.. రూ.149కి డబుల్ డేటా

19-10-2017 Thu 07:58 | Business
  • రూ.399 ధర  రూ.459కి పెంచిన వైనం
  • చాలా ప్యాక్‌లకు డబుల్ డేటా, కాలపరిమితి పెంపు
  • డైలీ, వీక్లీ ప్లాన్లు ప్రకటన.. నేటి నుంచే అమల్లోకి
రిలయన్స్ జియో తన తాజా ప్లాన్లను భారీగా సవరించింది. కొన్ని పాప్యులర్ ప్లాన్ల ధరలను పెంచగా, కొన్ని ప్లాన్లలో డేటాను రెట్టింపు చేసింది. ఖాతాదారుల అభిమానాన్ని చూరగొన్న రూ.399 ప్లాన్  ధరను 15 శాతం పెంచి రూ.459 చేసింది. గతంలో ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు కాగా, తాజాగా దానిని 70 రోజుకు కుదించింది. సవరించిన ప్లాన్లు నేటి నుంచి అమలుకానున్నట్టు జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రూ.399 ప్లాన్‌ ధరను రెట్టింపు చేసిన జియో రూ.149, రూ.509 ప్యాక్‌లకు ఇప్పటి వరకు ఇస్తున్న డేటాను రెట్టింపు చేసింది. గతంలో రూ.149 ప్లాన్‌లో వినియోగదారులకు 2జీబీ డేటా లభించగా దానిని రెట్టింపు చేసి 4జీబీ డేటా అందిస్తోంది. అలాగే రూ.509 ప్లాన్‌లో ప్రస్తుతం రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుండగా ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు.  

వీటితోపాటు డైలీ, వీక్లీ  ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఖాతాదారులు ఉచితంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, 0.15 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు రూ.19, వారానికి రూ.52, రెండు వారాలకు రూ.98 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చని జియో పేర్కొంది. రూ.1,999 దీర్ఘకాలిక ప్లాన్‌లో గతంలో మూడునెలల కాలపరిమితి ఉండగా ఇప్పుడు దానిని ఆరు నెలలకు పెంచింది.  రూ.4,999 ప్లాన్‌లో గతంలో 210 రోజుల కాలపరిమితి ఉండగా తాజాగా దానిని ఏడాదికి పెంచింది.
Reliancejioplans

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more