వంద మందితో దీపావళి జరుపుకుంటున్నానంటున్న హీరోయిన్ హన్సిక!
- ముంబైలో దీపావళి చేసుకుంటున్న హన్సిక
- షూటింగ్ లో బ్రేక్ రావడంతో సంబరాలకు ఇంటికి వెళ్లిన హన్సిక
- దత్తత పిల్లలు, స్నేహితులు, బంధువులతో కలిసి దీపావళి వేడుకలు
స్నేహితులు, బంధువులు మొత్తం అంతా కలిసి ఓ వందమంది వరకు తమ ఇంటికి వచ్చారని చెప్పింది. తామంతా చాలా గ్రాండ్ గా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పింది. తన కోసం తన తల్లి గాగ్రా ఛోళీ, లంగా ఓణి కొన్నారని చెప్పింది. నిన్న కూడా పూజలు చేశామని, ఈ రోజు లక్ష్మీ పూజ అనంతరం దీపావళి సంబరాలు ఉంటాయని చెప్పింది. ఇక ఈ రోజు తాను దత్తత తీసుకున్న పిల్లల దగ్గరకి వెళ్లి, వారితో కొంత సమయం గడిపి, వారిని ఉల్లాసపరిచి, ఇంటికి వస్తానని, అనంతరం ఇంట్లో దీపావళి ఘనంగా జరుపుకుంటామని చెప్పింది.