దీపావళి సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు!
- ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు: నరసింహన్, కేసీఆర్
- పండుగ జరుపుకుంటోన్న రామ్‌చరణ్ తేజ్, రాధిక, రేణూ దేశాయ్, రకుల్ ప్రీత్ సింగ్
- భారీ శబ్దాలు వచ్చే టపాసులు కాల్చద్దని సందేశం
సినీనటులు రామ్‌చరణ్ తేజ్, రాధిక, రేణూ దేశాయ్, రకుల్ ప్రీత్ సింగ్ తమ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీప కాంతులతో దీపావళిని జరుపుకోవాలని, భారీ శబ్దాలతో వద్దని సందేశం ఇస్తున్నారు. తన భర్త రామ్‌చరణ్‌తో పాటు తాను దీపావళి వేడుకలను జరుపుకుంటున్నానని తెలుపుతూ ఉపాసన పలు ఫొటోలు పోస్ట్ చేసింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు టీమిండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ పేర్కొన్నారు.