పోకిరీలను వణికిస్తోన్న #Metoo ఉద్యమం... యువకుల చేష్టలను వీడియోలతో పాటు బయటపెడుతోన్న అమ్మాయిలు!
- సోషల్ మీడియాలో #Metoo లో వెల్లువెత్తుతోన్న అమ్మాయిల పోస్టులు
- అమ్మాయిల అసభ్య వీడియోలు పెడుతోన్న యువకుల సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్
- #Metooలో అమ్మాయిల పోస్టులపై స్పందిస్తామంటోన్న పోలీసులు
ఈ క్రమంలో #Metoo ద్వారా ఓ యువకుడు చేసిన బాగోతం బయట పడింది. ఆ యువకుడు అమ్మాయిల వీపుపై టచ్ చేసి, ఆ సందర్భంగా తీసిన వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ యువకుడు ఒకటి కాదు, రెండు కాదు, ఇటువంటివి ఏకంగా 144 పోస్టులు చేశాడు. మణిపాల్‌కు చెందిన ఓ మెడికల్ స్టూడెంట్ ఆ వీడియోలు చూసి వాటిని #Metooలో పెట్టింది. అతడి పేరు వినయ్ నాయర్ అని పేర్కొంది. దీంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకు పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం అతని అకౌంట్‌ను ఆయా వెబ్ సైట్ల నిర్వాహకులు బ్లాక్ చేశారు.
మరోపక్క, #Metoo ఉద్యమంపై రాజకీయ నాయకులు, పోలీసులు కూడా స్పందిస్తున్నారు. #Metooలో ఫిర్యాదు చేసినా నిందితులపై చర్యలు తీసుకుంటామని కోల్‌కతా పోలీసులు కూడా ప్రకటించారు. తాము కూడా బాధితులమేనంటూ చాలా మంది యువతులు చేస్తోన్న పోస్టులను చూసి తాము షాక్‌కు గురయ్యామని తెలిపారు. #Metoo పై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లైంగిక దాడికి గురవుతున్నామని చెబుతోన్న వారి ఆవేదనను అందరూ వినిపించుకోవాలని, వారికి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.