కోహ్లీపై మరోసారి ధ్వజమెత్తిన నెటిజన్లు!
- కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పని కోహ్లీ
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజెన్లు
- అంత పొగరు పనికిరాదంటూ హితవు
ఇదే సమయంలో నెటిజెన్ల దృష్టి కెప్టెన్ విరాట్ కోహ్లీపై పడింది. కుంబ్లేకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలపకపోవడంతో... కోహ్లీపై నిప్పులు చెరుగుతున్నారు. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ ను కలిసేందుకు, ఫుట్ బాల్ ఆడేందుకు కోహ్లీకి టైమ్ ఉందికానీ... కుంబ్లేకు బర్త్ డే విషెస్ చెప్పడానికి మాత్రం టైమ్ లేదా? అంటూ మండిపడుతున్నారు. కోహ్లీ తీరు సిగ్గు చేటని పోస్టులు పెడుతున్నారు. కోహ్లీకి ఇంత గర్వం పనికిరాదని అంటున్నారు.