నారా లోకేశ్: విశాఖపట్నం తరహాలో విజయవాడను క్లీన్ సిటీగా మారుస్తాం: మంత్రి నారా లోకేశ్

  • విజయవాడలో పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం
  • ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం
  • నవంబర్ లో సమన్వయ సమావేశాలు, బహిరంగ సమావేశాలు
  • రేషన్ లో ఇతర సరుకులు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తా: లోకేశ్
విశాఖపట్నం తరహాలో విజయవాడను కూడా క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విజయవాడలోని కేశినేని భవన్ లో పార్లమెంటరీ పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, విజయవాడను క్లీన్ సిటీగా మార్చడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

 నవంబర్ లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మిగిలిన నియోజకవర్గాల్లో సమన్వయ సమావేశాలు, బహిరంగ సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా లోకేశ్ ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రతి నెలా ఇచ్చే రేషన్ లో ఇతర సరుకులు కూడా ఇవ్వాలని ప్రజలు కోరుతున్న విషయాన్ని లోకేశ్ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకురాగా, త్వరలో సరుకులు పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
నారా లోకేశ్
పార్లమెంటరీ పార్టీ సమన్వయ

More Telugu News