తగ్గిన 'రాజుగారి గది 2' వసూళ్లు .. మళ్లీ పుంజుకుంటాయా?

18-10-2017 Wed 11:33 | Entertainment
  • తొలి వారాంతంలో భారీ వసూళ్లు 
  • సోమవారానికి పడిపోయిన వసూళ్లు 
  • రంగంలోకి మరో రెండు సినిమాలు 
  • గట్టిపోటీగా నిలిచే ఛాన్స్  
నాగార్జున .. సమంత .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రాజుగారి గది 2' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలివారాంతంలో ఈ సినిమా 9.58 కోట్లను కొల్లగొట్టింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అయింది. ముఖ్యంగా సమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోవడం కలవరపెడుతోంది.

సాధారణంగా వీకెండ్ తరువాత వచ్చే సోమవారానికి వసూళ్లు కొంతవరకూ తగ్గుతాయి. కానీ ఈ సినిమాకి భారీగా తగ్గడం ఆలోచనలో పడేస్తోంది. దీనికి తోడు 'రాజా ది గ్రేట్' .. 'అదిరింది' గట్టిపోటీని ఇవ్వనున్నాయి. ఈ రోజు నుంచి వీకెండ్ వరకూ హాలిడేస్ మూడ్ ఉండటంతో, ఈ సినిమా వసూళ్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రవితేజ .. విజయ్ సినిమాల పోటీని తట్టుకుని 'రాజుగారి గది 2' నిలబడుతుందా? పడిపోయిన వసూళ్లు మళ్లీ పుంజుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. 
nagarjunasamanta

More Telugu News

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09
..more