ప్రధాని కార్యాలయంలో అగ్నిప్రమాదం!

  • పీఎంవోలో చెలరేగిన మంటలు
  • సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
  • యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు
ఢిల్లీలోని రైసినా హిల్స్ లోని సౌత్ బ్లాక్ లో గల ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. నేటి తెల్లవారు జామున ప్రధాని కార్యాలయంలోని రెండో అంతస్తులోని రూమ్ నెంబర్ 242లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పీఎంవో సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో సంఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. అనంతరం డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గుర్ముఖ్ సింగ్ మాట్లాడుతూ, నేటి ఉదయం 3.35 గంటల సమయంలో పీఎంవోలో అగ్నిప్రమాదం జరిగినట్లు కంట్రోల్‌ రూమ్‌ కు ఫోన్ కాల్ వచ్చిందని అన్నారు. దీంతో సిబ్బందితో కలిసి చేరుకుని, మంటలు అదుపులోకి తెచ్చామని తెలిపారు. కంప్యూటర్ లోని యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. 
Go Back to Shorts
pmo
fire accident
ups
ups short Circuit

More Telugu News