ఎన్నారై యువకుడి ఘనత.. 19 ఏళ్లకే... 100 కోట్లు సంపాదించాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్నారై యువకుడి ఘనత.. 19 ఏళ్లకే... 100 కోట్లు సంపాదించాడు!

  • ‘డోర్‌ స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌ సైట్‌ ద్వారా స్తిరాస్థి వ్యాపారం ప్రారంభించిన అక్షయ్ రూపారెలియా
  • యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా ఎదిగిన వైనం  
  • బంధువుల నుంచి అప్పుగా తీసుకున్న 7 వేల డాలర్లే పెట్టుబడి
బ్రిటన్ కోటీశ్వరుల జాబితాలో 19 ఏళ్ల భారత సంతతి యువకుడు స్థానం సంపాదించి సత్తాచాటాడు. కేవలం ఏడువేల డాలర్లతో వ్యాపారాన్ని ప్రారంభించి, దానిని వందకోట్ల సంస్థగా మార్చాడు. దాని వివరాల్లోకి వెళ్తే... భారతీయ సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా (19) కళాశాల విద్యనభ్యసిస్తున్నాడు.

విద్యార్థిగా ఉంటూనే ‘డోర్‌ స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌ సైట్‌ కు రూపకల్పన చేసిన అక్షయ్.. అనతికాలంలోనే దానిని యూకేలో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థగా తీర్చిదిద్దాడు. పెట్టుబడిగా పెట్టిన 7 వేల డాలర్లు కూడా బంధువుల నుంచి అప్పుగా తీసుకున్నవి కావడం విశేషం. ఈ వెబ్ సైట్ ప్రత్యేకత ఏంటంటే.. యూకేలో స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం సేకరించి, దానిని తమ సైట్లో పోస్ట్ చేస్తుంటారు.

కేవలం 16 నెలల్లోనే తన వ్యాపారాన్ని 12 మిలియన్‌ పౌండ్ల (103 కోట్ల రూపాయలకు పైగా) కు చేర్చాడు. దీంతో బ్రిటన్ లో అత్యంత పిన్న వయస్కుడైన కోటీశ్వరుడిగా నిలిచాడు. తానింతవరకు 100 మిలియన్‌ పౌండ్ల (దాదాపు 860 కోట్ల రూపాయలు) స్థిరాస్తులను తన వెబ్ సైట్ ద్వారా విక్రయించానని అక్షయ్‌ తెలిపాడు. కాగా, ఆర్థిక, గణిత శాస్త్రాల్లో ఉన్నత విద్యకోసం అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి అక్షయ్ కు అవకాశం వచ్చినప్పటికీ, తన ఆన్ లైన్ వెబ్ సర్వీసును విస్తరించాలని భావించి దానిని వదులుకున్నాడు.
nri
uk
investor
young billionaire

More Telugu News