పాత ట్రెండ్ లోకి చంద్రబాబు.. విజయవాడలో ఆకస్మిక తనిఖీలు!
- ఏడాది తర్వాత ఆకస్మిక తనిఖీలను చేపట్టిన సీఎం
- ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి తనిఖీలు
- అధికారులకు పలు ఆదేశాలను జారీ చేసిన చంద్రబాబు
పాత బస్టాండు వద్ద ఉన్న పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్కు కాల్వ గట్టుపై పచ్చదనం, సుందరీకరణ పనులను పరిశీలించారు. ఆ తర్వాత బస్టాండులోకి వచ్చి తనిఖీలను కొనసాగించారు. ఇదే సమయంలో నగరంలోని పలు అభివృద్ధి పనులను కూడా ఆయన తనిఖీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.