గుండెల్లో కత్తి దిగినా.. నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న ధీరుడు!

  • గుండెల్లో కత్తితో ఆసుపత్రికి వెళ్లిన న్యూయార్క్ యువకుడు
  • దారిలో అతనిని చూసి షాక్ కు గురైన స్థానికులు
  • చికిత్స అందించి ప్రాణం కాపాడిన వైద్యులు
గుండెల్లో కత్తి దిగితే... కత్తిపోటు వల్ల జరిగే నష్టం కంటే ముందుగా షాక్ తో చచ్చిపోతారు. అలాంటిది గుండెల్లో కత్తి దిగినా ఓ యువకుడు సమీపంలోని ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది. న్యూయార్క్ కు చెందిన ముహమ్మద్ రమీరెజ్ (35) కత్తిపోటుకి గురయ్యాడు. ఎంతలా అంటే, అతని ఛాతీలో దిగిన కత్తి అతని గుండె అంచు దాకా దిగబడిపోయింది.

దీంతో రక్తం ధారలుగా కారుతున్నా ఎలాంటి ఆందోళన చెందకుండా ఐదుబ్లాకుల తరువాత ఉన్న క్వీన్స్ ఆసుపత్రికి అలాగే నడుచుకుంటూ వెళ్లాడు. అతనిని చూసిన వారు షాక్ తిన్నారు. వైద్యులు మాత్రం హుటాహుటీన వైద్యమందించి, ప్రాణాలు కాపాడారు. ఇంతలో పోలీసులు అతనిని కత్తితో పొడించింది ఎవరు? అన్న విషయం ఆరాతీసేందుకు సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు. 

america
new York
young men
stabbed
hospitalized

More Telugu News