Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్!

  • సంతోష్ శ్రీనివాస్ తో పవన్ మూవీ 
  • కొనసాగుతోన్న స్క్రిప్ట్ పనులు
  • విజయ్ చేసిన 'తేరీ' తరహా కథ 
  • ఆ సినిమాకి రీమేక్ మాత్రం కాదు  
ప్రస్తుతం పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను పవన్ ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు కొంత కాలంగా షికారు చేస్తున్నాయి. 'కందిరీగ' సినిమాతో దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్ తన సత్తాను చాటుకున్నాడు.

 ఇక ఆయన పవన్ తో చేయనున్న సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి కావొచ్చాయని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడట. ఈ సినిమా ఫస్టాప్ అంతా కూడా తమిళంలో విజయ్ చేసిన 'తేరి' కథను పోలి వుంటుందట. అయితే ఆ సినిమాకి ఇది రీమేక్ మాత్రం కాదు. సెకండాఫ్ చాలా డిఫరెంట్ గా .. ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయిక ఎవరు? ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? అనే విషయాలు త్వరలోనే తెలిసే ఛాన్స్ వుంది.            
pavan

More Telugu News