మీకు ఉద్యోగాలు కావాలంటే ఈ పని చేయండి: నిరుద్యోగులకు రఘువీరా పిలుపు
- మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలను గద్దె దించండి
- ప్రచారం చేసుకోవడం తప్ప... ఉద్యోగాలను కల్పించడం లేదు
- నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుంది
కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీని చేపట్టడం లేదని రఘువీరా విమర్శించారు. దేశ చరిత్రలో అతి తక్కువ ఉద్యోగాలను కల్పించిన ఘనత మోదీకే దక్కుతుందని అన్నారు. యూపీఏ హయాంలోనే అత్యధిక ఉద్యోగాలను కల్పించినట్టు గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. కేవలం రైల్వే శాఖలోనే 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా అంటూ మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడమే తప్ప... చేసిందేమీ లేదని విమర్శించారు.
నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ అండగా నిలబడుతుందని... ఖాళీ పోస్టులను భర్తీ చేసేంత వరకు పోరాడుతుందని రఘువీరా అన్నారు. నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ త్వరలోనే ఆందోళన కార్యక్రమాలను చేపడతాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ఈ కార్యక్రమాలకు యవతీయువకులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని విన్నవించారు.