అద్దెకు దిగిన దంపతుల ఏకాంత దృశ్యాల చిత్రీకరణ.. అశ్లీల వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన వైనం!
- భార్యాభర్తల దృశ్యాలను సీసీ కెమెరాతో చిత్రీకరించిన ఇంటి ఓనర్ కుమారుడు
- మిత్రులు చెప్పడంతో దిగ్భ్రాంతికి గురైన దంపతులు
- సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన దంపతులు
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఈ దౌర్భాగ్యానికి ఒడిగట్టింది ఇంటి ఓనర్ కుమారుడు అంజన్ అని నిర్ధారించారు. వారిద్దరూ ఇంట్లో లేని సమయంలో డూప్లికేట్ తాళంతో ఇంట్లోకి ప్రవేశించిన అంజన్ వారి బెడ్ రూంలో సీసీ కెమెరా పెట్టి, వారిద్దరూ ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించాడు. అనంతరం వాటిని ఒక శృంగార వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడని తేల్చారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, అతను పరారయ్యాడు. దీంతో ప్రత్యేక టీమ్ తో అతని కోసం గాలింపు చేపట్టారు.