ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను దాటేసిన ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్‌... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను దాటేసిన ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్‌... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌!

  • 876 పాయింట్ల‌తో బౌల‌ర్ల జాబితాలో మూడోస్థానంలో ఉన్న క‌గిసో ర‌బాడా
  • రెండో స్థానంలో ర‌వీంద్ర జ‌డేజా
  • మొద‌టిస్థానంలో ఇంగ్లండ్ బౌల‌ర్ జేమ్స్ ఆండ‌ర్స‌న్‌
అక్టోబ‌ర్ 11న ప్ర‌క‌టించిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బౌల‌ర్ల జాబితాలో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను దాటేసి ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ క‌గిసో ర‌బాడా మూడో స్థానాన్ని చేరుకున్నాడు. ఇటీవ‌ల బంగ్లాదేశ్‌తో ఆడిన రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీసి క‌గిసో 876 పాయింట్లు సాధించాడు. దీంతో 852 పాయింట్లు సాధించిన‌ ర‌విచంద్ర‌న్ అశ్విన్ నాలుగో స్థానానికి వెళ్లాడు.

ఈ జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో ఇంగ్లండ్‌కు చెందిన జేమ్స్ ఆండ‌ర్స‌న్ (896 పాయింట్లు), ర‌వీంద్ర జ‌డేజా (884 పాయింట్లు)లు ఉన్నారు. ఇక బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన‌ స్టీవ్ స్మిత్ (936 పాయింట్ల‌), ఇంగ్లండ్‌కు చెందిన జోయి రూట్ (889 పాయింట్లు), న్యూజిలాండ్ ఆట‌గాడు కేన్ విలియ‌మ్స‌న్ (880 పాయింట్లు)లు మొద‌టి మూడు స్థానాల్లో ఉన్నారు. నాలుగో స్థానంలో భార‌త ఆట‌గాడు చ‌టేశ్వ‌ర్ పుజారా (876 పాయింట్లు) ఉన్నాడు. ఇక ఆల్ - రౌండ‌ర్ ప్లేయ‌ర్ల జాబితాలో బంగ్లాదేశ్ ఆట‌గాడు ష‌కీబ్ అల్ హాస‌న్ (437 పాయింట్లు) మొద‌టి స్థానంలో ఉండ‌గా, భార‌త ఆట‌గాళ్లు ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు త‌ర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారు.
icc test
rankings
ravichandran ashwin
ravindra jadeja
kasigo ragaba

More Telugu News