హ్యాకింగ్ కు గురైన దిగ్గజ కంపెనీ డెలాయిట్!
- డెలాయిట్ పై దాడి చేసిన హ్యాకర్లు
- 350 క్లయింట్ల వివరాల తస్కరణ
- డేటా చోరీపై పెదవి విప్పని డెలాయిట్
- ఆందోళనలో అమెరికా
అయితే కంపెనీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని డెలాయిట్ ఈ హ్యాకింగ్ పై పెదవి విప్పడం లేదని తెలుస్తోంది. కేవలం ఆరుగురు క్లయింట్లకు సంబంధించిన సమాచారం మాత్రమే తస్కరణకు గురైందని పేరు చెప్పేందుకు ఇష్టపడని వ్యక్తి సమాచారం ఇచ్చారని ఆ కథనం తెలిపింది. అలాగే అమెరికాకు చెందిన స్టేట్, ఎనర్జీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ, డిఫెన్స్ డిపార్ట్ మెంట్లకు చెందిన కీలక వివరాలు తస్కరణకు గురయ్యాయని తెలుస్తోంది. దీంతో అమెరికా ఆందోళనలో పడినట్టు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.